ఎందుకు? ఏమిటి?? ఎలా???
*ప్రశ్న:* ఆ పేలుడుకి ఉందా సాక్ష్యం?
*జవాబు:* బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం ఒకప్పుడు అత్యధిక సాంద్రత, ఉష్ణోగ్రతలు కలిగిన ఒక చిన్న బిందువు. అది 1200 కోట్ల సంవత్సరాల క్రితం పెద్ద శబ్దంతో పేలిపోయి కాంతి వేగంకన్నా ఎక్కువ వేగంతో విస్తరించింది. దాన్నే మహావిస్ఫోటం (బిగ్‌బ్యాంగ్) అంటారు. ఆ బిందువు అలా పేలిపోవడానికి కారణాలేంటో ఇప్పటికీ తెలియవు. అయితే ఈ సిద్ధాంతాన్ని రుజువు చేసే కొన్ని దృష్టాంతరాలు నమోదయ్యాయి.
బిగ్‌బ్యాంగ్ ఉత్పన్నం చేసిన వికిరణ శక్తి (Radiation) ఇప్పటికీ విశ్వంలో కాస్మిక్ సూక్ష్మ తరంగ నేపథ్య వికిరణాల (casmic micro wave background radiation) రూపంలో ఉంది. ఈ కిరణాలను తొలిసారి ఆర్నోపెంజియాస్, రాబర్ట్ విల్సన్ అనే శాస్త్రవేత్తలు 1964లో కనుగొన్నారు. వీరు అప్పటి ధ్వని తరంగాలను వినడమే కాకుండా, ఈ వికిరణాల ఉష్ణోగ్రత మూడు కెల్విన్‌లుగా నిర్ధరించారు. దీంతో మహావిస్ఫోటం సిద్ధాంతానికి బలమైన మద్దతు లభించింది. కాస్మిక్ సూక్ష్మతరంగ నేపథ్య వికిరణాలు భూమి వైపు అన్ని దిశల నుంచీ వస్తున్నాయి. ఈ ధ్వనిని బిగ్‌బ్యాంగ్ ప్రతిధ్వనిగా భావించవచ్చు.
🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
*ప్రశ్న: పాము తనని తాము కాటు వేసుకుంటే అది చనిపోతుందా?*
*పాము తనను తాను కాటు వేసుకున్నా,లేక అది వేరే పామును కాటు వేసినా ఏమీ కాదు.కాని ఇతర ప్రాణులపై(ముంగిస మినహాయింపు) మాత్రం దాని ప్రభావం ఉంటుంది.పాము విషం అనేది సక్లిష్టమైన పాలీపెప్టైడు లతో మరియు ఎంజైములతో కూడిన ఒక ప్రోటీన్.ఈ విషం మూడు రకాలు.సైటో టాక్సిన్-ఇది కణాలను నేరుగా చంపేస్తుంది,హీమోటాక్సిన్-ఇది రక్తం గడ్డకట్టే వ్యవస్థను నాశనం చేస్తుంది,న్యూరో టాక్సిన్-శరీర కండరాలలో ఉండే అసిటైల్ కోలిన్ అనే రసానాన్ని నిరోధిస్తుంది,తద్వారా కండరాలన్ని చచ్చుబడి (Paralysis) పోతాయి.ఈ విధంగా పాము విషం శరీరంపై పనిచేయడం వల్ల జీవులు మరణిస్తాయి.ఐతే విచిత్రంగా పాము,ముంగిస లాంటి వాటి శరీరంలో ప్రత్యేకమైన వ్యవస్థ నిర్మితమై ఉంటుంది.వాటిలో విషప్రభావంకు గురయ్యే Receptors లేకపోవడం వలన ఆ విషం ఏమీ చేయదు.*