COVID-19 Updates

29_12_21
28_12_21

27_12_2021
26_12_2021
24_12_2021
22_12_2021
21_12_2021
20_12_2021

19_12_2021

18_12_2021
13_12_2021

09_12_2021
08_12_2021
07_12_2021
06_12_2021
05_12_2021

04_12_2021
03_12_2021
02_12_2021
01_12_2021
30_11_2021
29_11_2021
28_11_2021
27_11_2021
21_11_2021

20_11_2021
19_11_2021
18_11_2021
17_11_2021
16_11_2021
14_11_2021
13_11_2021
12_11_2021
09_11_2021
07_11_2021
04_11_2021
*🔊🦠కరోనాను అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలు*


*🍥వాషింగ్టన్‌: వివిధ కరోనా వైరస్‌ల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్‌, కొవిడ్‌-19 తీవ్రతను ఇవి గణనీయంగా తగ్గిస్తాయని నిర్ధారించారు. ‘డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌’ చేపట్టిన ఈ పరిశోధన వివరాలను సైన్స్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ పత్రిక అందించింది. వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తిచేసే సుమారు 1,700 రకాల యాంటీబాడీలను శాస్త్రవేత్తలు సేకరించారు. ఇవన్నీ వైరస్‌ల ఉపరితలంపై ఉండే నిర్దిష్ట భాగాలను చేజిక్కించుకుని, తర్వాత వాటి పనిపడతాయి. అయితే, వైరస్‌లు మార్పు చెందినప్పుడు కొన్ని యాంటీబాడీలు వాటిని గుర్తించలేవు. ఉపరితల భాగాల ఆకృతి మారడం వల్ల వాటిని పట్టుకోలేవు. సరిగ్గా ఇదే అంశంపై బార్టన్‌ హేన్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దృష్టి సారించింది. వైరస్‌ ఉపరితలంపై మార్పుచెందని భాగాలనూ, వాటిని లక్ష్యంగా చేసుకునే 50 రకాల యాంటీబాడీలనూ గుర్తించింది. ఇవి సార్స్‌-కొవ్‌-1 (సార్స్‌), సార్స్‌-కొవ్‌-2 (కొవిడ్‌-19) తీవ్రతను సమర్థంగా అడ్డుకుంటాయని నిర్ధారించింది. భవిష్యత్తులో సార్స్‌-కొవ్‌-3, 4 వైరస్‌లు మనిషికి సోకినా, వాటి నుంచి కూడా ఈ ప్రతినిరోధకాలు రక్షణ కల్పిస్తాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.*
03_11_2021

01_11_2021
31_10_2021
*🔊🦠Coronavirus Origin: కరోనా మూలాలు ఎప్పటికీ కనిపెట్టలేమా?*

*🎙️అమెరికా నిఘా సంస్థలు ఏమంటున్నాయంటే..*

*🍥వాషింగ్టన్‌: యావత్తు ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపిన కరోనా మహమ్మారి మూలాలు ఇప్పటికీ చిక్కలేదు. ఐక్యరాజ్య సమితి నిపుణుల బృందం, అమెరికా నిఘా సంస్థలు జరిపిన విస్తృత స్థాయి అధ్యయనాలు చివరకు ఫలితం తేల్చకుండానే ముగిసే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా దీనిపై అధ్యయనం జరిపిన ఓ అమెరికా నిఘా సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్‌ మూలాలు ఎప్పటికీ కనిపెట్టలేమేమోనని అనుమానం వ్యక్తం చేసింది.*

*🌀తీవ్ర ఒత్తిడి మధ్య అమెరికా నిఘా సంస్థలను గత మే నెలలో అధ్యక్షుడు బైడెన్ 90 రోజుల విచారణకు ఆదేశించారు. మహమ్మారి మూలాలపై ఉన్న రెండు రకాల వాదనలపై విస్తృత అధ్యయనం చేపట్టాలని నిర్దేశించారు. దీనిపై దర్యాప్తు జరిపిన నిఘా సంస్థలు ఆగస్టులోనే నివేదికను సమర్పించాయి. జంతువుల నుంచి మనిషికి ఈ వైరస్ సోకి ఉంటుందనే వాదనతో పాటు ల్యాబ్‌లో సృష్టించారన్న వాదనకు కూడా సమాన అవకాశాలు ఉన్నాయన్నారు.*

*🥏తాజాగా దీనిపై శుక్రవారం మరో నివేదిక బహిర్గతమైంది. ఏ ఒక్క వాదనకు బలమైన ఆధారాలు లేవని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు వైరస్‌ మూలాలపై అమెరికా నిఘా సంస్థలకు చాలా తక్కువే తెలుసని అంగీకరించారు. అయితే, వైరస్‌ను జీవాయుధంగా మాత్రం సృష్టించి ఉండకపోవచ్చునని నివేదికలో పేర్కొన్నారు. నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కౌన్సిల్‌తో పాటు మరో నాలుగు నిఘా సంస్థలు వైరస్‌ సహజసిద్ధంగా జన్మించి ఉంటుందన్న వాదనవైపు మొగ్గుచూపాయి. ‘ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌’ మాత్రం ల్యాబ్‌ నుంచి లీక్‌ అయ్యి ఉంటుందన్న వాదనను విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. కానీ, వీటిలో ఏ ఒక్క సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌కు లేదా శ్వేతసౌధానికి వైరస్‌ పుట్టుకకు ఇదే కారణమంటూ బలమైన ఆధారాలను ఇవ్వలేకపోయాయి. దీంతో రెండు వాదనలపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి.*

*💠ప్రకృతిలో సహజసిద్ధంగా కనిపించని.. కరోనా కుటుంబానికి చెందిన కొన్ని వైరస్‌లను వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌లో సృష్టించారని నివేదికలో పేర్కొన్నారు. కానీ, కొవిడ్‌-19కు కారణమైన కరోనా కూడా అదే కోవకు చెందిందా.. లేదా.. అన్నది మాత్రం చెప్పలేమని నిఘా సంస్థలు తెలిపాయి. దీనిపై మరింత లోతైన సమాచారం లభిస్తే తప్ప వైరస్‌ మూలాలపై ఓ నిర్దిష్టమైన అభిప్రాయానికి రాలేమని తేల్చిచెప్పాయి.*
30_10_2021

*🔊Covid Treatment: కొవిడ్‌ చికిత్స పరిశోధనలో కీలక పురోగతి..!*

*🌀సమర్థవంతమైన ఔషధాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు*

*🍥ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చినప్పటికీ చికిత్సకు సంబంధించిన పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలపై ప్రయోగాలు* *జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శాస్త్రవేత్తలు మరో పురోగతి సాధించారు. ఇన్‌ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్‌* *పునరుత్పత్తిని అణచివేసే సామర్థ్యమున్న ఔషధ చికిత్సను బ్రిటన్‌, జర్మనీ* *శాస్త్రవేత్తలు గుర్తించారు.*
*కొవిడ్‌-19కు కారణమయ్యే వైరస్‌ సోకినపుడు కణాల్లో అవి ఎలాంటి చర్యలు, ప్రభావాలను చూపుతున్నాయనే విషయంపై బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటి ఆఫ్‌ కెంట్‌తో పాటు జర్మనీకి చెందిన గైథే యూనివర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెంటోజ్‌ ఫాస్ఫేట్‌ అనే జీవక్రియా మార్గం క్రియాశీలకంగా మారినప్పుడు మాత్రమే సార్స్‌-కోవ్‌-2 కణాల పునరుత్పత్తి వేగంగా జరుగుతున్నట్లు గుర్తించారు.*

 *🥏అయితే, వీటిని అణచివేయడంలో బెన్‌ఫో-ఆక్సిథియామిన్‌ ఔషధం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు బ్రిటన్‌, జర్మనీ నిపుణులు కనుగొన్నారు. తద్వారా ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలు కరోనా వైరస్‌ కణాలను ఉత్పత్తిని తగ్గించవచ్చని ఓ నిర్ధారణకు వచ్చారు. కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన తాజా అధ్యయనం మెటాబోలైట్స్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.*

*💠వైరల్‌ వ్యాధుల చికిత్సకు రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడమే అత్యంత ప్రధాన సమస్య కావున విభిన్న లక్ష్యాలతో వీటిపై పరిశోధనలు చేయడం ఎంతో ముఖ్యం. సమర్థవంతమైన కొవిడ్‌ చికిత్స అభివృద్ధి చేయడంలో తాజా అధ్యయనంలో కీలక పురోగతి సాధించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ కెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ మార్టిన్‌ మిషెలీస్‌ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో కొవిడ్‌ చికిత్సా విధానంపై మరింత పురోగతిని సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు.*
28_10_2021
27_10_2021
26-10-2021



Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము