సందేహాలు - సమాధానాలు

*సందేహం*

*ఎన్ని సంవత్సరాలు క్వాలిఫైయింగ్ సర్వీసు చేసి రిటైర్ అయితే రిటైర్మెంట్ గ్రాట్యూటీ చెల్లిస్తారు?*

*✍️ జ॥ 5 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీసు చేసి రిటైర్ అయితే రిటైర్మెంట్ గ్రాట్యూటీ*

*రూలు 46 (1)(ఎ)*


*సందేహం*

*5 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీసు చేసి చనిపోయిన ఉద్యోగికి రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఎలా, ఎంత మొత్తం చెల్లిస్తారు?*

*✍️ జ॥ రూలు 47 (1)లో తెలిపిన విధంగా అతని కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. అలాగే అతను 18 సంవత్సరాల క్వాలిఫైయింగ్ సర్వీసు చేస్తే ఎంత మొత్తం అయితే వస్తుందో అంత మొత్తం చెల్లిస్తారు.*

*రూలు - 46 (1) (బి)*


*సందేహం*

*రిటైర్మెంటు గ్రాట్యూటీ చెల్లించడంలో ఆలస్యమైతే దానిపై వడ్డీ చెల్లించాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా?*

*✍️ జ॥ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి (ఫైనాన్స్ డిపార్టుమెంట్ అనుమతి కూడా అవసరం)* 

*రూలు 46 (1) - ఎ*



*🏵️సందేహాలు - సమాధానాలు*

*🏵️ప్రశ్న:*
వేసవి సెలవుల్లో పని చేస్తే ELs ఎలా జమచేస్తారు??
*✅జవాబు:*
వేసవి సెలవులు 15 రోజులు కన్నా తక్కువగా వాడుకుంటే,మొత్తం వేసవి సెలవులు వాడుకోలేదన్నట్లుగా భావించి 24 ELs ఇస్తారు.
•••••••••
*🏵️ప్రశ్న:*
సంపాధిత సెలవును అర్ధ జీతపు సెలవు, వేసవి సెలవులతో కలిపి ఒకేసారి ఎన్ని రోజులు వాడుకోవచ్చు??
*✅జవాబు:*
ఒకేసారి 180 రోజులకి మించి వాడుకోకూడదు.
•••••••••
*🏵️ప్రశ్న:*
ఒక ఉద్యోగి సస్పెన్షన్ లో ఉన్నప్పుడు ఉద్యోగం నుంచి విరమించుకోవచ్చా??
*✅జవాబు:*
విరమించుకోవటానికి అతనికి అనుమతి ఇవ్వరు.
•••••••••
*🏵️ప్రశ్న:*
ఉద్యోగ విరమణ చేసే సమయంలో సస్పెండ్ అయితే ఎలా చేస్తారు??
*✅జవాబు:*
అతని సర్వీసును ఉన్నతాధికారులు పొడిగిస్తారు.
•••••••••
*🏵️ప్రశ్న:*
బ్యాంకు లో 15G ఫారం ఎప్పుడు ఇవ్వాలి??
*✅జవాబు:*
ఒక బ్యాంక్ లో మనం డిపాజిిట్ చేసిన మొత్తం డబ్బులు పై సంవత్సరం నకు 10,000రూ పైన వడ్డీ వస్తే టాక్స్ పడకుండా ఉండేందుకు బ్యాంకు వారికి 15G ఫారం మరియు పాన్ కార్డు zerox కాపీ ఇవ్వాలి.అపుడు బ్యాంకు వారు మన డిపాజిిట్ లపైన టాక్స్ ను కట్ చేయరు. ఈ రెండూ ఇవ్వకపోతే వచ్చే వడ్డీ లో టాక్స్ కట్ చేస్తారు.ఈ రెండు ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరులో ఇవ్వాలి.

*🏵️సందేహాలు - సమాధానాలు*

*🌺ప్రశ్న:*
610 మేరకు ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు మారితే సీనియారిటీ ఎలా లెక్కపెడతారు ?

*✅జవాబు:*
అతని పాత సీనియారిటీ కొనసాగుతుంది.
•••••••••

*🌺ప్రశ్న:*
నేను SA గా పదోన్నతి పొందాను.నాకు ప్రస్తుతం 56 ఇయర్స్.GOT పాస్ అయ్యాను.నాకు 12 ఇయర్స్ స్కేల్ వస్తుందా??

*✅జవాబు:*
మెమో.21073 తేదీ:21.2.2009 ప్రకారం మీకు 12 ఇయర్స్ స్కేల్ ఇవ్వటం సాధ్యపడదు.
•••••••••

*🌺ప్రశ్న:*
నేను 19 ఇయర్స్ సర్వీసు పూర్తి చేశాను.వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉందా??

*✅జవాబు:*
వాలంటరి రిటైర్మెంట్ తీసుకోవటానికి 20 ఇయర్స్ సర్వీసు తప్పక ఉండాలి.ఐతే 20 ఇయర్స్ సర్వీసు లేకుండానే ఒక టీచర్ కి జీఓ.51  తేదీ:24.8.13 ప్రకారం వాలంటరి రిటైర్మెంట్ కి అవకాశం కల్పించారు. మీరు కూడా ప్రభుత్వం ద్వారా ప్రత్యేక ఉత్తర్వులు పొందవలసి ఉంటుంది.
•••••••••
*🌺ప్రశ్న:*
11 రోజులను కూడా సరెండర్  చేసుకోవచ్చా??

*✅జవాబు:*
జీఓ.334 తేదీ:28.9.1977 ప్రకారం 11 రోజులు కూడా సరెండర్ చేసుకొని నగదు పొందవచ్చు.
•••••••••

*🌺ప్రశ్న:*
సరెండర్ లో IR చెల్లించబడతాయా??

*✅జవాబు:*
IR మాత్రం చెల్లించబడదు.


*సందేహాలు - సమాధానాలు*


1. ప్రశ్న:
*నేను DEO గారి అనుమతి తో లీన్ పై ఇతర రాష్ట్రంలో ఉద్యోగం నకు ఎంపిక అయ్యాను. నేను ఆ ఉద్యోగంలో ఇమడ లేకపోతే తిరిగి నా సొంత పోస్టుకి రావచ్చునా?*

జవాబు:
*జీఓ.127 తేదీ:8.5.12 ప్రకారం కొత్త పోస్టులో ప్రొబేసన్ డిక్లరేషన్ ఐన తేదీ, లేదా పోబేషన్ డిక్లరేషన్ అయినట్లు భావించబడే తేదీ లేదా నూతన పోస్టులో చేరిన తేదీ నుంచి 3 ఇయర్స్ లో ఏది ముందు ఐతే ఆ తేదీ వరకు పాత పోస్టుపై లీన్ కొనసాగుతుంది. అప్పటిలోగా మీరు పాత పోస్టుకి వచ్చే అవకాశం ఉంటుంది.*


2. ప్రశ్న:
*బోన్ టీబీ కి ప్రత్యేక సెలవు ఉన్నదా?*

జవాబు:
*6 నెలల వరకు పూర్తి జీతంపై అర్ధ జీతపు సెలవు మంజూరు చేస్తారు.*


3. ప్రశ్న:
*నేను జీత నష్టపు సెలవు పెట్టి M. ed చేయాలని అనుకుంటున్నాను. నేను ఏమి నష్టపోతాను?*

జవాబు:
*జీత నష్టపు సెలవు పెట్టినంతకాలం ఇంక్రిమెంట్, AAS స్కేల్స్ వాయిదా పడతాయి. 3 ఇయర్స్ పైన జీతనష్టపు సెలవుకాలం పెన్షన్ కి అర్హదాయక సర్వీస్ గా పరిగణింపబడదు.*


4. ప్రశ్న:
*నేను, నా భర్త టీచర్లం. నా భర్త మరణించిన పిదప నాకు కుటుంబ పెన్షన్ ఇస్తున్నారు. దీనికి DA ఇవ్వరా?*

జవాబు:
*జీఓ.51, తేదీ: 30.4.15 ప్రకారం కారుణ్య నియామకం పొందిన వారికి మాత్రమే DA ఇవ్వరు. మీకు కుటుంబ పెన్షన్ పై DA చెల్లిస్తారు.*

Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము