కరోనా చదువులు


*🔊TS News: ‘పది’లో ఈసారి ఆరు పరీక్షలే: విద్యాశాఖ ఉత్తర్వులు*

*🍥హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతిలో ఈ ఏడాది ఆరు పరీక్షలే నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ‘పది’ పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతంలో 11 పేపర్లకు బదులుగా ఈసారి ఆరు పరీక్షలే నిర్వహించాలని, ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఉండాలని నిర్ణయించారు.*

*🌀రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా ప్రభావంతో  పాఠశాలల్లో ఇంకా పూర్తిస్థాయిలో తరగతులు నిర్వహించలేని పరిస్థితుల్లో పరీక్ష విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదే ఈ మార్పులు చేసింది. అయితే, చివరి నిమిషంలో పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల కారణంగా పరీక్ష రాయకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా గతేడాది ప్రతిపాదించిన విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. కొత్త విధానం ప్రకారం పదో తరగతి విద్యార్థులకు ఆరు పరీక్షలే నిర్వహిస్తారు. గతంలో 11 పేపర్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది 166 రోజులు బోధన నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ ఇంకా గురుకులాలు తెరుచుకోలేదు. రాష్ట్రంలో విద్యార్థులు కూడా పాఠశాలలకు పూర్తిస్థాయిలో రావడంలేదు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న విద్యాశాఖ అధికారులు పరీక్ష విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించారు.*

*🔴Telangana | టెన్త్ విద్యార్థుల‌కు గుడ్ న్యూస్.. ప‌రీక్షా స‌మ‌యం అర‌గంట పెంపు*

_హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు విద్యాశాఖ శుభ‌వార్త వినిపించింది. 

ప్ర‌స్తుతం ప‌రీక్షా స‌మయం 2 గంట‌ల 45 నిమిషాలు కాగా.. దీన్ని 3 గంట‌ల 15 నిమిషాల‌కు పెంచింది. 

ప్ర‌శ్న‌ల్లో మ‌రిన్ని ఛాయిస్‌లు ఇవ్వాల‌ని విద్యాశాఖ నిర్ణ‌యించింది. 

బోర్డు ప‌రీక్ష‌కు 80 మార్కులు, ఎఫ్ఏ ప‌రీక్ష‌ల‌కు 20 మార్కులు కేటాయించ‌నున్నారు. 

సైన్స్ ప‌రీక్ష‌లు భౌతిక‌, జీవ‌శాస్త్రాల‌కు వేర్వేరు స‌మాధాన ప‌త్రాలు ఇవ్వ‌నున్నారు._

2021-22 విద్యా సంవ‌త్స‌రానికి గానూ.. 11 పేప‌ర్ల‌కు బ‌దులుగా ఆరు పేప‌ర్ల‌తోనే ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. 

ఒక్కో స‌బ్జెక్టుకు ఒక్కో పేప‌రే ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. 

అయితే ఈ ఏడాదికి గానూ ఉర్దూను సెకండ్ ల్యాంగ్వేజ్‌ను ప‌రిగ‌ణిస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. 

ఈ మేర‌కు ప‌ది ప‌రీక్ష‌ల విధానంపై విద్యాశాఖ కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్త‌ర్వులు జారీ చేశారు. 
వ‌చ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు._














Popular posts from this blog

ఉపాధ్యాయులకు ఉపయోగించే సమాచారము